News April 4, 2025
నాగర్‌కర్నూల్: పెద్దపులి దాడి.. యజమానులకు నష్టపరిహారం

NGKL జిల్లా అచ్చంపేట ప్రాంతంలో రెండు నెలల క్రితం పెద్దపులి దాడిలో మృతిచెందిన పశువుల యజమానులకు అటవీ శాఖ నష్టపరిహారం అందజేసింది. బక్క లింగాయపల్లి, దండాలం గ్రామాలకు చెందిన హరి, వెంకట్రామ్, రాకేశ్‌కు వరుసగా రూ.15,000, రూ.15,000, రూ.12,000 చొప్పున చెక్కులను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుబూర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరేంద్ర, అధికారులు బాలరాజు, జ్యోతి, రజిత తదితరులు ఉన్నారు.
Similar News
News April 11, 2025
కోనో కార్పస్ చెట్ల నరికివేత షురూ

TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోనో కార్పస్ చెట్ల నరికివేత ప్రక్రియను GHMC అధికారులు ప్రారంభించారు. ఈ చెట్ల పుప్పొడి రేణువులతో ప్రమాదం ఉంటుందని, ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెప్పడంతో వాటిని తొలగిస్తున్నారు. కోనో కార్పస్ చెట్లను నరికేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి సూచించారు. అలాగే జిల్లాల్లో ఉన్న ఈ చెట్లనూ తొలగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
News April 11, 2025
పాడేరులో 1,03,078 పేపర్ల వాల్యుయేషన్

అల్లూరి జిల్లా కేంద్రం అయిన పాడేరులో కొత్తగా ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో మొత్తం 1,03,078 పదో తరగతి పేపర్ల మూల్యాంకనం చేసినట్లు DEO బ్రహ్మాజీరావు శుక్రవారం తెలిపారు. 18,904 ఇంగ్లిష్, 16,375 మాథ్స్, 21,693 PS, 23099 BS, 23,007 సోషల్ స్టడీస్ పేపర్స్ వాల్యుయేషన్ చేశామన్నారు. మొత్తం 510 మంది టీచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.
News April 11, 2025
VIRAL: ఓటమి బాధలో కోహ్లీ(PHOTO)

నిన్న ఢిల్లీ చేతిలో సొంతగడ్డపై ఓటమితో ఆర్సీబీ ప్లేయర్లు నైరాశ్యంలో మునిగిపోయారు. డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ తీవ్రమైన బాధలో కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇతర చోట్ల విజయం సాధించినా సొంత గ్రౌండ్‌లో వరుస పరాజయాలు ఆర్సీబీ ప్లేయర్లను బాధిస్తున్నాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా నిన్న కేఎల్ రాహుల్ క్లాసీ ఇన్నింగ్సుతో బెంగళూరుకు మ్యాచును దూరం చేశారు.