News March 20, 2025

నాగర్‌కర్నూల్: ముగిసిన ఇంటర్ పరీక్షలు..

image

ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 33 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 5 నుంచి పరీక్షలు జరిగాయి. ద్వితీయ సంవత్సరం 5,996 మంది విద్యార్థులకు గానూ 207 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నాగర్ కర్నూల్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి జి.వెంకటరమణ తెలిపారు. గురువారం పరీక్షలు పూర్తికావడంతో విద్యార్థులు కేంద్రాల నుంచి ఉత్సాహంతో బయటకు వచ్చారు. దీంతో బస్టాండ్‌లు విద్యార్థులతో కిక్కిరిశాయి.

Similar News

News March 28, 2025

నెల్లూరు: ఐదుగురు ఎంపీటీసీలు సస్పెండ్ 

image

విడవలూరు మండలానికి సంబంధించిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను వైసీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఆవుల శ్రీనివాసులు(రామచంద్రాపురం), అక్కయ్యగారి బుజ్జమ్మ(పెద్దపాళెం), వెందోటి భక్తవత్సలయ్య(వరిణి), ముంగర భానుప్రకాశ్(దంపూరు), చింతాటి జగన్మోహన్(అలగానిపాడు)ను సస్పెండ్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు.

News March 28, 2025

జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుకు నాలుగు రోజుల సెలవు

image

ఈనెల 29 నుంచి ఏప్రిల్ 1వరకు నాలుగు రోజులపాటు జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటిస్తున్నట్లు శుక్రవారం జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ప్రకటన ఒక ద్వారా తెలిపారు. రైతులు ఈ 4 రోజులు మార్కెట్‌కు తమ ఉత్పత్తులను తీసుకురావద్దని, తిరిగి 2న మార్కెట్ పునః ప్రారంభమవుతుందన్నారు.

News March 28, 2025

ప.గో: AMC ఛైర్మన్లు ఎవరంటే..?

image

ఉమ్మడి ప.గో జిల్లాలో పలువురికి నామినేటెడ్ పదవులు దక్కాయి. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా పలువురికి అవకాశం దక్కింది.
☞ తణుకు: కొండే శివ (టీడీపీ)
☞ తాడేపల్లిగూడెం: మంగాబాయి (జనసేన, పైఫొటో)
☞ ఉంగుటూరు: కరేటి జ్యోతి(జనసేన)
☞దెందులూరు: గారపాటి రామసీత(టీడీపీ)
☞ ఏలూరు: మామిళ్లపల్లి పార్థసారథి (టీడీపీ)

error: Content is protected !!