News April 16, 2025

నాగర్‌కర్నూల్: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీళ్లే..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ-దేవరకొండ రోడ్డులో <<16112661>>ఎర్రగుంటపల్లి<<>> వద్ద మంగళవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తికి చెందిన కార్తిక్, అరవింద్ పని నిమిత్తం బైక్‌పై దేవరకొండకు వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 19, 2025

ఇషాంత్ శర్మకు వడదెబ్బ!

image

అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు వడదెబ్బ తగిలింది. ఆయన్ను బౌండరీ లైన్ బయటికి తీసుకెళ్లిన GT సిబ్బంది, లిక్విడ్స్ అందించి తడి టవల్స్‌తో సపర్యలు చేశారు. స్టేడియం వద్ద ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేయడంతో అటు గుజరాత్, ఇటు ఢిల్లీ జట్ల ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం ఎండ దెబ్బకు ఇబ్బంది పడ్డారు.

News April 19, 2025

విశాఖ అభివృద్ధే సీఎం లక్ష్యం: మంత్రి డోలా

image

వైసీపీ 5 ఏళ్ల పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి శూన్యమని విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. శనివారం ఆయన జీవీఎంసీలో మేయర్‌పై అవిశ్వాసం నెగ్గిన సందర్భంగా కూటమి కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. వైసీపీ అరాచకాలు అడ్డుకునేందుకే కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.

News April 19, 2025

సిరిసిల్ల: ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి

image

యాసంగి పంట కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్‌ ఝాతో హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే పంట కొనుగోలు సజావుగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు.

error: Content is protected !!