News February 21, 2025

నాగర్‌కర్నూల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని తాడూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కాలువలో పడటంతో యువకుడు మృతిచెందిన ఘటన నిన్న సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలిలా.. కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన వినోద్‌గౌడ్ బైక్‌పై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రోడ్డుపక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో వినోద్ మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News December 13, 2025

డెల్టా హాస్పిటల్స్‌లో 100 రోజుల్లో 60 రోబోటిక్ శస్త్రచికిత్సలు

image

రాజమండ్రిలోని డెల్టా హాస్పిటల్స్‌లో కేవలం 100 రోజుల్లో 60కి పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసినట్టు హాస్పిటల్ ఎండీ డాక్టర్ నితిన్ రిమ్మలపూడి (ఎంఎస్ సర్జన్) తెలిపారు. గాల్ బ్లాడర్, హెర్నియా, గర్భాశయ, బేరియాట్రిక్, థైరాయిడ్ శస్త్రచికిత్సలను ఈ ఆధునిక పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సాంకేతికత వలన పేషెంట్లు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో త్వరగా కోలుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

News December 13, 2025

పల్నాడు: మల్లమ్మ సెంటర్‌కు ఆపేరు ఎలా వచ్చిందో తెలుసా..!

image

నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్ అంటే తెలియని వారు ఉండరు. వినుకొండ, సత్తెనపల్లి, పల్నాడు, గుంటూరు వెళ్లే 4 మార్గాలను కలిపే కూడలిని మల్లమ్మ సెంటర్ అంటారు. ఈ కూడలిలో చందనం మల్లమ్మ 1945లో మిఠాయి దుకాణం ప్రారంభించారు. ఆమె చేసిన మిఠాయిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీసుకెళ్లటంతో మల్లమ్మ షాపు ప్రజలకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత పెద్ద బజారుగా ఉన్న ఆ కూడలికి 1970 నుంచి మల్లమ్మ సెంటర్‌గా వాడుకలోకి వచ్చింది.

News December 13, 2025

తిరుపతిలో మరో 4 స్టార్ హోటల్

image

తిరుపతిలో ‘హిల్‌టన్ గార్డెన్ ఇన్’ పేరిట 4-స్టార్ హోటల్ నిర్మించనున్నారు. నాంది హోటల్స్ సంస్థ రూ.149.65 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ చేపట్టనుంది. 222 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. కంపెనీకి 10 ఏళ్లు 100% నికర SGST రీఫండ్‌, స్థిర మూలధన పెట్టుబడిలో 10% (గరిష్ఠంగా ₹10 కోట్లు) ప్రోత్సాహకం అందించనున్నారు. స్టాంప్ డ్యూటీ, విద్యుత్ డ్యూటీ రీఫండ్‌ ఇస్తారు. అక్కారంపల్లిలో దీనిని నిర్మిస్తారు.