News February 13, 2025
నాగర్‌కర్నూల్‌లో మహిళ దారుణ హత్య

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో శాంతమ్మ(45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ కనకయ్య విచారణ చేపట్టారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.
Similar News
News December 16, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే!

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24గంటల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. డోంగ్లి, నస్రుల్లాబాద్ 10.2°C, లచ్చపేట దోమకొండ 10.4, మేనూర్ పెద్దకొడప్గల్, బొమ్మన్ దేవిపల్లి 10.5, జుక్కల్ 10.6, ఎల్పుగొండ 10.7, రామలక్ష్మణపల్లి, బిచ్కుంద 10.8, నాగిరెడ్డిపేట 10.9, సర్వాపూర్, మగ్దుంపూర్, పిట్లం 11, గాంధారి, పుల్కల్ 11.1, ఇసాయిపేట 11.2°C గా నమోదయ్యాయి.
News December 16, 2025
VJA: రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ACB దాడి

విజయవాడ పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ EE కార్యాలయంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న నగేశ్ బాబు లంచం తీసుకుంటూ ACB అధికారులకు చిక్కాడు. విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జున నుంచి ధ్రువపత్రం ఇచ్చేందుకు రూ. 15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న సమయంలో ACB అధికారులు పట్టుకుని, నగేశ్ బాబు ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
News December 16, 2025
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,520 తగ్గి రూ.1,33,860కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,400 పతనమై రూ.1,22,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,11,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


