News February 23, 2025
నాగర్‌కర్నూల్‌లో యువతి SUICIDE

కల్వకుర్తిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలిలా.. పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉంటున్న అనూష(20) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఇంటర్ విద్యార్థి ఆమె ప్రేమించుకుంటున్నారు. కాగా.. మంగళవారం సదరు విద్యార్థితో అనూష ఫోన్ మాట్లాడిన అనంతరం పురుగు మందు తాగగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. పోస్టుమార్టంలో యువతి గర్భందాల్చినట్లు ఆరోపణలున్నాయి. కేసు నమోదైంది.
Similar News
News February 23, 2025
MBNR: నేడే గురుకుల విద్యాలయాలకు ప్రవేశ పరీక్ష

గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు నేడు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 62 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. హాల్‌టికెట్లతో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటోలతో రావాలని సూచించారు. ఉ. 11 గం. నుంచి మ.1 గంట వరకు జరిగే పరీక్షకు ఉ.9 గం.లకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
News February 22, 2025
MBNR: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎంపీ

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఎస్‌ఎల్‌బీసీ ఎడమగట్టు కాలువ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో అనేక మంది కార్మికులు గాయాలపాలు కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ పనులను పునఃప్రారంభం చేశారు. ఇంతలోనే ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
News February 22, 2025
MBNR: ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించింది ఎక్కడంటే!

రాష్ట్రంలో మొదటి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నారాయణపేటలో లాంఛనంగా ప్రారంభించారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లి గ్రామంలో దళిత మహిళ బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేసి.. ఇండ్ల నిర్మాణానికి పత్రాలను గ్రామ మహిళలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రెడ్డిని కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.