News March 15, 2025
నాగసముద్రంలో 41°C ఉష్ణోగ్రత

అనంతపురం జిల్లాలో రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం జిల్లాలోని నాగసముద్రంలో ఏకంగా 41°C ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Similar News
News March 15, 2025
MHBD జిల్లా అమ్మాయికి వరుస ఉద్యోగాలు

మహబూబాబాద్ పట్టణానికి చెందిన డోలి సంధ్య గ్రూప్-3లో 269.9 మార్కులతో 1,125 ర్యాంకు సాధించింది. జోనల్ స్థాయిలో బీసీ-ఏ మహిళా విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. ఇప్పటికే గ్రూప్-4 లో ఉన్నత ర్యాంకు సాధించిన సంధ్య మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తుంది. అదే విధంగా ఈ నెల 11న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సంధ్య 382.4 మార్కులతో 205 ర్యాంకు సాధించింది.
News March 15, 2025
SRH అభిమానులకు గుడ్ న్యూస్

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి యోయో టెస్టు పాసయ్యారు. బెంగళూరులోని NCAలో నిర్వహించిన ఈ పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించారు. దీంతో ఆయన రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరతారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆయన గాయపడ్డారు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పక్కటెముకల గాయానికి గురయ్యారు. అప్పటినుంచి ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నారు.
News March 15, 2025
తణుకు: పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ఫొటో

తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించి, స్వచ్ఛాంధ్ర కల సాకారం చేసుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన పరిసరాలను పరిశుభ్రం చేసి వారితో కలిసి ఫోటో దిగారు. ఈ పిక్‌ను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.