News April 3, 2025

నాగాయలంక: రూ.13.50లక్షల నిధులు దుర్వినియోగం 

image

నాగాయలంక పీఏసీఎస్‌లో రూ.13.50 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు తన తనిఖీలో గుర్తించామని మచిలీపట్నం కేడీసీసీ బ్యాంక్ విచారణాధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు. గురువారం నాగాయలంక కేడీసీసీ బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్‌లో తాను ఆడిట్ అధికారిగా వచ్చి నాగాయలంక పీఎసీఎస్‌లో పలు రికార్డులను తనిఖీ చేయగా, ఎరువుల స్టాక్‌లో వ్యత్యాసాలు, మొత్తాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 

Similar News

News April 10, 2025

కేసరపల్లి: చెరువులో పడి మహిళ మృతి  

image

గన్నవరం మండలం కేసరపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వడ్డెర కుటుంబానికి చెందిన లక్ష్మి(45) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం కేసరపల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.   

News April 10, 2025

కృష్ణా: నియోజకవర్గానికి ఒక MSME పార్క్ ఏర్పాటు- కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో నియోజకవర్గానికి ఒక MSME పార్క్ నెలకొల్పుటకు అనువైన స్థలాలను గుర్తించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రెవెన్యూ డివిజనల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ MSME పార్కుల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.

News April 10, 2025

కృష్ణా : ముగిసిన ‘పది’ మూల్యాంకణం

image

మచిలీపట్నం లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకణ బుధవారంతో ముగిసింది. ఈ నెల 1వ తేదీన మూల్యాంకణ ప్రారంభమవ్వగా మొత్తం 1,89,852 సమాధాన పత్రాలను మూల్యాంకణ చేశారు. సుమారు 1000 మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు మూల్యాంకణ విధుల్లో పాల్గొన్నారు.

error: Content is protected !!