News April 4, 2024
నాగిరెడ్డిపేటలో బీఆర్ఎస్ నాయకుల సంబరాలు

నాగిరెడ్డిపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం వైస్ ఎంపీపీ పై అవిశ్వాసం నెగ్గడంతో సంబరాలు జరుపుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ ఎంపీపీగా కొనసాగిన వైస్‌ఎంపీపీ దివిటి రాజ్ దాస్ పై బీఆర్ఎస్ ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆర్డీవో ప్రభాకర్ సమక్షంలో అవిశ్వాసం నెగ్గడంతో బీఆర్ఎస్ నాయకులు ఆనందంతో మిఠాయిలు పంచుకొని టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
Similar News
News March 3, 2025
NZB: తండ్రి మందలించడంతో అదృశ్యం

నిజామాబాద్‌లో తండ్రి మందలించడంతో నవదీప్(17), నవ్య(19) అదృశ్యమైనట్లు వన్ టౌన్ SHO రఘుపతి ఆదివారం రాత్రి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మార్చి 1వ తేదీన వీరిద్దరినీ తండ్రి రాజన్న మందలించాడు. దీంతో వారు ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. తిరిగి రాకపోవడంతో తండ్రి రాజన్న బంధువుల వద్ద వెతికినా జాడ దొరకలేదు. దీంతో రాజన్న ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News March 3, 2025
NZB: పానీపూరి తిని కత్తితో దాడి

ఓ వ్యక్తి పానీపూరి తిని.. రూ.10 డబ్బులు అడిగిన సదరు చిరు వ్యాపారిపై కత్తితో దాడి చేసిన ఘటన నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. నగరంలోని శంకర్ భవన్ స్కూల్ వద్ద చిరు వ్యాపారి ఆకాశ్ పానీపూరీ బండి నడిపిస్తున్నారు. హర్మీత్ సింగ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆకాశ్ వద్ద పానీపూరి తిన్నాడు. అనంతరం ఆకాశ్ డబ్బులు అడిగాడు. నన్నే అడుగుతావా అంటూ హర్మీత్ సింగ్ చిన్న చాకుతో ఆకాశ్ వేళ్ళు కోశాడు.
News March 3, 2025
సిరికొండ : సీనియర్ నేషనల్స్ హాకీ పోటీలకు తూంపల్లి క్రీడాకారిణి

సీనియర్ నేషనల్స్ హాకీ పోటీలకు సిరికొండ మండలం తూంపల్లి క్రీడాకారిణి మమత ఎన్నికైనట్లు అధ్యాపకులు తెలిపారు. ఇటీవల జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించిన సీనియర్ నేషనల్ హాకీ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయస్థాయి హాకీ పోటీలు మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారిణిని పలువురు అభినందించారు.