News February 6, 2025
నాగేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటాం: సీతక్క
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738812690631_51702158-normal-WIFI.webp)
కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి <<15374769>>నాగేశ్వరరావు మృతి<<>> పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని సహకారాలు అందిస్తామన్నారు. నాగేశ్వరరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News February 6, 2025
కరెంట్ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738835452127_367-normal-WIFI.webp)
AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని మంత్రివర్గ సమావేశంలో తేల్చి చెప్పారు. అవకాశం ఉంటే తగ్గించాలన్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వేగంగా అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. నూతన విద్యాసంవత్సరం మొదలయ్యేలోపే డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
News February 6, 2025
భద్రాద్రి: 38,536 మందికి రైతు భరోసా నిధులు జమ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738835781695_1280-normal-WIFI.webp)
తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాకు కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాలు, గ్రామాల వారీగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. భద్రాద్రి జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న 38,536 మంది రైతుల ఖాతాలలో రూ.45,683,6754 జమయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తుండగా, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.
News February 6, 2025
NZB: జూనియర్ కళాశాలను DIEO తనిఖీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738830404634_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ గర్ల్స్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి (DIEO) రవి కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో జియో ట్యాగింగ్ చేయాలని, కెమెరాలు పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా పరీక్షలు జరుగుతున్న మరికొన్ని కళాశాలలను ఆయన తనిఖీ చేశారు.