News March 20, 2025
నాటుసారా తయారీపై సమాచారం ఇవ్వండి: ఏలూరు కలెక్టర్

ఏపీని నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా నాటుసారా నిర్మూలించడానికి ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. గురువారం నాటుసారా నిర్మూలనకై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నాటుసారా తయారీపై టోల్ ఫ్రీ నంబర్ 14405 సమాచారం ఇవ్వాలన్నారు. సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ PS కిషోర్ తదితరులు ఉన్నారు.
Similar News
News March 28, 2025
యాత్రలు విద్యార్థుల అభివృద్ధికి దోహదం చేస్తాయి: కలెక్టర్

బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర యాత్రను బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజ్ఞాన విహారయాత్రలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పాఠశాలలో కార్యక్రమాలకు భిన్నంగా విజ్ఞాన యాత్రలు విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగిస్తాయని అన్నారు.
News March 28, 2025
భద్రాద్రి రాముడికి పోచంపల్లి పట్టు వస్త్రాలు

భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పోచంపల్లి పట్టు వస్త్రాలు తయారవుతున్నాయి. ఎస్ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు దోర్నాల శ్రీనాథ్, ఇంజమూరి యాదగిరి, ఆడేపు ఆంజనేయులు, కడవేరు చంద్రశేఖర్ భద్రాచలంలోని భక్త రామదాసు ధ్యాన నిలయంలో ఏర్పాటు చేసిన మగ్గాలపై పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు, పట్టు పంచలనేస్తున్నారు.
News March 28, 2025
ప్రకాశం జిల్లాలోనే అధిక ఎండలు

ప్రకాశం జిల్లాలో గురువారం ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగింది. రాష్ట్రంలో అధిక ఎండలు ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నేడు పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఎండలకు బయటకు వెళ్లేముందు, గొడుగు, టోపీలు వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం మంచు కురవడం గమనార్హం.