News September 25, 2024
నాడు MLA టికెట్ వచ్చినా మంతెన త్యాగం.. నేడు ప్రతిఫలం
ఎన్నికల వేళ TDP తొలి జాబితాలో ఉండి MLA టికెట్ మంతెన రామరాజుకు కేటాయించిన విషయం తెలిసిందే. అనంతరం మారిన రాజకీయ సమీకరణాల వల్ల పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన టికెట్ త్యాగం చేశారు. అక్కడ రఘురామకృష్ణ రాజు గెలుపునకు కృషి చేశారు. నాటి త్యాగానికి ప్రతిఫలంగా నిన్న ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో ఆయనకు ప్రాధాన్యం దక్కింది. కీలకమైన APIIC ఛైర్మన్ పదవి కేటాయించి పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించింది.
Similar News
News November 28, 2024
ఓ రూముకు నా పేరు పెట్టి బెదిరిస్తున్నారు: RRR
తనను వేధించిన వాళ్లంతా జైలుకు వెళ్లడం వాళ్లు చేసుకున్న కర్మేనని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు(RRR) పేర్కొన్నారు. ‘ముసుగు వేసుకుని మరీ నన్ను కొట్టారు. ఆరోజు నా ఛాతీపై బరువైన వ్యక్తి కూర్చోవడంతో మంచం కోళ్లు కూడా విరిగిపోయాయి. నన్ను ఏ రూములో అయితే కొట్టారో దానికి RRR పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ రూములోకి ఎంతోమందిని తీసుకెళ్లి బెదిరించి దందాలు చేశారు’ అని RRR చెప్పారు.
News November 28, 2024
ఏలూరు: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎస్ఐ శివాజీ వివరాల ప్రకారం.. దెందులూరు మండలంలోని ఓ గ్రామంలో భార్యాభర్తలు అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటి ఓనర్ కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. అతను అద్దెకు దిగిన వారి నాలుగేళ్ల కుమార్తెపై నవంబర్ 25న అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు.
News November 28, 2024
సమస్యైతే నాకే ఫోన్ చేయండి: చింతమనేని
‘ఇది మీ ప్రభుత్వం. మీ శ్రేయస్సు మాకు ముఖ్యం’ అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం వంగూరులో బడి బస్సు ఆలస్యంగా వెళ్లింది. దీంతో ఆయన బుధవారం రాత్రి విద్యార్థులతో మాట్లాడారు. ఏ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలిగినా సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. వారు స్పందించకపోతే నేరుగా తనకు కాల్ చేస్తే నేరుగా వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.