News June 12, 2024
నాడు కొవ్వూరులో ఓటమి.. నేడు మంత్రిగా

2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి బరిలో నిలిచిన వంగలపూడి అనిత 25248 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కాగా తాజా ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున బరిలో నిలిచి 1,20,042 ఓట్లు సాధించి 43727 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు.
Similar News
News May 8, 2025
తూ.గో: అవార్డు అందుకున్న కలెక్టర్

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆంధ్రపదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా ప్రశంపా పత్రం స్వీకరించారు. 2022-23 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం కోసం చేసిన కృషిని గుర్తింపు లభించింది.
News May 7, 2025
రాజానగరం: ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్షకు కేంద్రాలు ఏర్పాటు

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నిర్వహించే ఏపీ పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్షకు గైట్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రెండు పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.రామానుజం, వైస్ ప్రిన్సిపల్ టి.రామారావు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. GIET కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,791 మంది పరీక్ష రాయనున్నట్టు పేర్కొన్నారు.
News May 7, 2025
దేవరపల్లి: తల్లిదండ్రులకు నెలకు 5,000 చెల్లించండి

తల్లితండ్రులను వృద్ధాప్య దశలో చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ ప్రశాంతి మండిపడ్డారు. శనివారం దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన కోలా వరలక్ష్మి, కృష్ణమూర్తి వయోవృద్ధుల పోషణ సంక్షేమ ట్రిబ్యునల్లో నమోదు అయ్యింది. కలెక్టర్ ఛాంబర్లో ఆర్డీవో రాణి సుస్మిత, ఫిర్యాదుదారుడి సమక్షంలో కోర్టు నిర్వహించారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు ప్రతి నెల ఐదు వేలు చెల్లించాలని ఆదేశించారు.