News April 19, 2024
నామినేషన్ వేసిన RS ప్రవీణ్ కుమార్
నాగర్ కర్నూల్ పార్లమెంట్ BRS అభ్యర్థి ప్రవీణ్ కుమార్ శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి ఉదయ్ కుమార్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈనెల 24న నాగర్ కర్నూల్లో నిర్వహించే రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొనేందుకు రానున్నారు. 24న నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రవీణ్ కుమార్ మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.
Similar News
News December 24, 2024
MBNR: అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వినతి
మహబూబ్నగర్ పట్టణంలోని డీసీసీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, ఒబేదుల కోత్వాల్, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News December 24, 2024
MBNR: ఇంటర్ విద్య బలోపేతంపై దృష్టి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. రాబోయే వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు ఫీల్డ్ ఆఫీసరుగా డీడీ. లక్ష్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా ఇంటర్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్దిష్ట పరిశీలన, సూచనలతో కూడిన నివేదికను రూపొందిస్తామని అధికారులు తెలిపారు.
News December 24, 2024
MBNR: నైపుణ్యాల అభివృద్ధికి స్కిల్ సెంటర్: కలెక్టర్
జిల్లాలోని యువత నైపుణ్యాల అభివృద్ధికి స్కిల్ సెంటర్ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. MBNR లో ఏర్పాటు చేస్తున్న స్కిల్ సెంటర్ను సోమవారం అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు దిగ్గజ సంస్థలలో ఉద్యోగాలు కల్పించడానికి అవసరమైన నైపుణ్యాలు కల్పించడం, ఆంగ్లంలో మాట్లాడడం, మౌఖిక పరీక్షలు ఎదుర్కొనేల శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.