News January 24, 2025
నాయుడుపేట: బాలుడి మిస్సింగ్
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నందముని అనే బాలుడు మిస్ అయ్యాడు. సూళ్లూరుపేట మండల పరిధిలోని మన్నెమూర్తి గ్రామానికి చెందిన నందముని నాయుడుపేటలో చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల తర్వాత తల్లిదండ్రులు పాఠశాలలో వదిలారు. గురువారం నుంచి విద్యార్థి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 5, 2025
NTR: అలర్ట్.. పరీక్షా ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో నవంబర్- 2024లో నిర్వహించిన స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.
News February 5, 2025
వెంకటగిరి: APSP హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి
వెంకటగిరి ( వల్లివేడు )లోని APSP 9th బెటాలియన్‌లో పనిచేస్తున్న 2013 బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ మగ్గం నరసయ్య (35) బుధవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఆయన స్వగ్రామం పెళ్లకూరు మండలం జీలపాటూరు. ఆయనకు ఇటీవలే వివాహమయ్యింది. ఇతని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం పట్ల బెటాలియన్‌లోని తోటి సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు.
News February 5, 2025
మోరిలో సత్రానికి 116 ఏళ్లు..!
సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలోని వీరభద్రయ్య అన్నదాన సత్రానికి 116 ఏళ్లు పూర్తయ్యాయి. ఏటా అంతర్వేది తీర్థానికి వచ్చే యాత్రికులకు అష్టమి, నవమి, దశమి తిథుల్లో మోరి వద్ద జాన శంకరయ్య కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. తీర్థం రోజున అంతర్వేదిలోనూ భోజనాలు అందిస్తున్నారు. పూర్వం నడిచి వెళ్లే భక్తులకు ఈ సత్రమే ఆశ్రయం ఇచ్చేదని గ్రామస్థులు చెబుతున్నారు.