News April 2, 2025
నారాయణపేట: GOVT జాబ్స్ కొట్టారు.. సజ్జనర్ అభినందనలు

నారాయణపేట డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ కూతురు వీణ 118 ర్యాంకును, టీఐ-2గా పనిచేస్తున్న వాహిద్ కూతురు ఫహిమీనా ఫైజ్ 126 ర్యాంకు సాధించడంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనర్ ఆ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగుల కుమార్తెలు గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడం అభినందనీయమని కొనియాడారు.
Similar News
News April 5, 2025
2034 తర్వాతే జమిలి ఎన్నికలు: నిర్మల

2029లోపే ‘జమిలి’ని అమలు చేస్తారనే వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. 2034 తర్వాతే ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నామన్నారు. ‘2024 LS ఎన్నికలకు ₹లక్ష కోట్లు ఖర్చయ్యింది. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తే GDP 1.5% వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవస్థకు ₹4.50L Crను జోడించవచ్చు’ అని చెప్పారు.
News April 5, 2025
సిరిసిల్ల: తొలి దశలోనే గుర్తించాలి: డీఎంహెచ్వో

అంగన్వాడీ సెంటర్లలోని పిల్లల లోపాలను ఇతర దశలోనే గుర్తించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్ల పట్టణంలో సమితి అధికారులతో శనివారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 7 నుంచి అంగన్వాడీ పిల్లలకు అప్తాలమిక్ ద్వారా పెరుగుదల లోపాలను తొలి దశలోనే గుర్తించాలన్నారు. అనంతరం మెరుగైన వైద్యం అందించి భవిష్యత్తులో కంటిచూపు సమస్య తీవ్రతను తగ్గించే విధంగా చూడాలని ఆదేశించారు.
News April 5, 2025
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం

ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం శనివారం జరిగింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ, CS కె. విజయానంద్, CRDA కమిషనర్ కె.కన్నబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజధాని పనులలో పురోగతి, అమరావతి పునః నిర్మాణ పనులకు ప్రధాని మోదీ హాజరు కానున్నందున కార్యక్రమ సన్నాహకాల గురించి చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.