News April 21, 2025
నారాయణపేట: OYO రూమ్‌లో యువకుడి సూసైడ్

NRPT జిల్లా గుండుమాల్ వాసి కుమ్మరి రాజేశ్(22) HYDలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమ్మరి రాజేశ్ HYD అంబర్పేట్ పరిధి రామ్‌నగర్‌లో ఉంటూ ప్రెవేట్ జాబ్ చేస్తూ పీజీ ఎంట్రెన్స్‌కు సిద్ధమవుతున్నాడని చెప్పారు. ప్రేమ విఫలం కావడంతో రామ్‌నగర్‌లోని ఓయో హోటల్ రూమ్‌లో ఆదివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్ఐ బాలరాజ్ తెలిపారు.
Similar News
News April 21, 2025
విజయనగరం: ఘనంగా సివిల్ సర్వీసెస్ డే

సివిల్ సర్వీస్ అధికారులు నిబద్ధత నిజాయతీగా ఉండి పేదలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా కలెక్టరేట్లో పౌర వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అంబేడ్కర్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ అధికారుల పని తీరులో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.
News April 21, 2025
డోలీ మోతలు లేకుండా చేస్తాం: మంత్రి సంధ్యారాణి

అల్లూరి సీతారామరాజు జిల్లా కించుమాందాలో రూ. 440 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్‌ను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ గ్రామ అభివృద్ధిలో కీలకమైన ముందడుగని మంత్రి తెలిపారు. డోలీ మోతలు లేకుండా అన్ని గిరిజన తండాలకు రోడ్లు వేస్తామని తెలిపారు. ప్రజలు, అధికారులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.
News April 21, 2025
ఆ పోస్టుకు సమంత లైక్.. విడాకుల కారణంపై చర్చ

‘భార్య అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేయడానికే మొగ్గుచూపుతాడు. కానీ భార్య మాత్రం భర్త ఆరోగ్యం బాగోలేకపోయినా అతడిని విడిచిపెట్టాలనుకోదు’ అనే ఓ ఇన్‌స్టా పోస్టుకు హీరోయిన్ సమంత లైక్ కొట్టారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది. సామ్ గతంలో మయోసైటిస్‌తో బాధపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యాధే ఆమె విడాకులకు కారణమా? అని చర్చించుకుంటున్నారు. 2021లో చైతూ, సామ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.