News April 2, 2025
నారాయణపేట జిల్లా పోలీసుల WARNING

నారాయణపేట జిల్లాలో ఈనెల 30 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ యోగేశ్ గౌతమ్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు, యువజన, రైతు, విద్యార్థి సంఘాలు ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Similar News
News April 5, 2025
విడదల రజినికి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం: అడ్వకేట్ జనరల్

స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి, డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి రజిని, ఆమె మరిది గోపికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదించారు. ACB వేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రజిని వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కేసులో రాజకీయ కారణాలు ఉన్నాయని రజని తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్, మహేశ్వర రెడ్డి వాదించారు.
News April 5, 2025
రెండో రోజూ భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గి సామాన్యుడికి కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹980 తగ్గి ₹90,660కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹900 తగ్గి ₹83,100గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,07,900కి చేరింది. కాగా, రెండ్రోజుల్లో తులం బంగారం రేటు రూ.2720 తగ్గడం విశేషం.
News April 5, 2025
రంప: చెరువులో జారిపడి వ్యక్తి మృతి

రంపచోడవరం మండలం పెద్దకొండకి చెందిన పి.బాబురావు (46) అదే గ్రామం శివారున ఉన్న చెరువులో జారిపడి మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువులోకి దిగి, అదుపు తప్పి లోపలికి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందాడని ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.