News April 5, 2025
నారాయణపేట జిల్లా ప్రజలకు WARNING

సైబర్ మోసగాళ్ల మాయమాటలు నమ్మొద్దని, కేటుగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ శుక్రవారం హెచ్చరించారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా టోల్ ఫ్రీ 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో https://www.cybercrime.gov.in సైతం ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వకూడదన్నారు. SHARE IT
Similar News
News April 13, 2025
రాష్ట్ర స్థాయి టాపర్‌గా ఆదర్శ రైతు కుమారుడు

కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన ఆదర్శ రైతు కారుమంచి షేక్ అహ్మద్ కుమారుడు షేక్ ఆసిఫ్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించారు. బైపీసీలో 440/430 మార్కులు సాధించి టాప్-10లో చోటుసాధించారు. విద్యార్థిని లెక్చరర్లు, కుటుంబ సభ్యులు అభినందించారు. ఆసిఫ్ మాట్లాడుతూ.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా వైద్య విద్య పూర్తి చేసి గ్రామస్థులకు సేవలందిస్తానని చెప్పారు.
News April 13, 2025
జగిత్యాల జైత్రయాత్ర గురించి మీకు తెలుసా..?

వేలాది జనం భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాలలో 1978 సెప్టెంబరు 9న రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభనే జగిత్యాల జైత్రయాత్రగా చరిత్రపుటల్లో లిఖించి ఉంది. ఈ సభకు ప్రజాయుద్ధనౌక గద్దర్ హాజరై తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. రైతుకూలీ సంఘాలు పీపుల్స్ వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి జగిత్యాల జైత్రయాత్ర బీజం వేసిందని చెబుతుంటారు. తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు ఇది ఊపునిచ్చింది.
News April 13, 2025
ఇంటర్ ఫలితాల్లో ఒకేషనల్ విద్యార్థుల సత్తా

INTER ఫలితాల్లో కుప్పం GOVT. ఒకేషనల్ JR కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. 500 మార్కులకుగాను అనూష 497 స్కోర్ సాధించి టాపర్‌గా నిలిచింది. అభినయశ్రీ 495 భవ్యశ్రీ 494 స్కోర్‌తో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ జ్యోతి స్వరణ్ తెలిపారు.