News April 4, 2025
నారాయణపేట జిల్లా రైతులకు కలెక్టర్ ముఖ్య గమనిక

రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వరి ధాన్యం (సన్న రకం) కొనుగోలుకు సంబంధించి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అయితే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని అన్నారు. గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలపై అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News April 11, 2025
మాతృభాషకు దూరం చేయవద్దు: వెంకయ్యనాయుడు

ఇంటర్ విద్యార్థులకు ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి తాను బాధపడినట్లు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా సంస్కృతం ఉంచాలని చూస్తుంటే మాత్రం, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సంస్కృతం తప్పు కాదని, అమ్మ భాష(తెలుగు)కు విద్యార్థులను దూరం చేయడం సరికాదన్నారు. జాతీయ విద్యావిధానం సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు.
News April 11, 2025
వరంగల్: భారీ ధర పలికిన పత్తి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గత వారం రోజులుగా పత్తి ధరలు రైతన్నలకు భారీ ఊరటనిస్తున్నాయి. గత నాలుగు నెలలుగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు పత్తి రికార్డు ధర పలికింది. ఈరోజు క్వింటా పత్తికి రూ.7,500 ధర వచ్చింది. ఈవారం మొదటి నుంచి ధరలు చూస్తే.. సోమవారం రూ.7,405, మంగళవారం రూ.7,355, బుధవారం రూ.7,400, గురువారం రూ.7425 ధర పలికాయి.
News April 11, 2025
ఎన్టీఆర్: బీటెక్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ థియరీ(రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి మే 7 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. సబ్జెక్ట్ వారీగా టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరాయి.