News April 1, 2025

నారాయణపేట: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో చోటుచేసుకుంది. మరికల్ ఎస్ఐ రాము కథనం మేరకు.. తీలేరు గ్రామానికి చెందిన సుభాష్‌కు తన భార్యకు కొన్ని రోజుల క్రితం గొడవలు జరగగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రమ్మన్నా ఆమె రాకపోవడంతో మనస్తాపం చెందిన సుభాష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News April 3, 2025

కంచ భూములపై ఫేక్ వీడియోలు.. BRS IT సెల్ ఇంచార్జిలపై కేసు

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచె భూములను ప్రభుత్వం చదును చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అక్కడి పరిస్థితులను తప్పుదోవ పట్టించేలా కొన్ని ఫొటోలు, వీడియోలు ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈక్రమంలో గచ్చిబౌలి పోలీసులు ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారనే ఆరోపణలపై BRS IT సెల్ ఇంచార్జ్‌లు క్రిశాంక్ & కొణతం దిలీప్‌లపై కేసు నమోదు చేశారు.

News April 3, 2025

నూజివీడు యువకుడు చికిత్స పొందుతూ మృతి

image

నూజివీడు పట్టణం రామమ్మారావుపేటకు చెందిన పండు బాబు (25) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 21న కడుపులో నొప్పి తట్టుకోలేక పురుగు మందు తాగి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేరాడు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పండు బాబు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News April 3, 2025

వనపర్తి: ఆరోగ్య నియమాల గోడపత్రికను విడుదల చేసిన కలెక్టర్ 

image

మిషన్ మధుమేహ కార్యక్రమంలో భాగంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు తమ జీవన విధానంలో పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనుల గురించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికను గురువారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఏ.శ్రీనివాసులు, ఎన్‌సీడీ రామచంద్రరావు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!