News March 22, 2025

నారాయణపేట: మే 10న మీ కోసమే..!

image

మే 10న జరిగే లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పోలీస్, ఎక్సైజ్, కోర్టు అధికారులు చెప్పారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కోర్టు సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ నిర్వహించారు. లోక్ అదాలత్ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని అన్నారు. డీఎస్పీ లింగయ్య, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 24, 2025

తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

image

సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్‌లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News March 24, 2025

ఘోర ప్రమాదం.. తమిళనాడులో కడప యువకులు మృతి

image

దైవదర్శనానికి వెళ్తున్న కడప యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కడపకు చెందిన నాగేంద్ర(31), శేషాచలం(29) ఆదివారం తమిళనాడు తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి దర్శనానికి బైకుపై వెళ్లారు. రాణీపేట సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కంటైనర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కిందపడ్డారు. అదే సమయంలో వచ్చిన కారు వారిపై వెళ్లింది. దీంతో ఇద్దరి శరీరాలు చిధ్రమై స్పాట్‌లో మృతి చెందారు.

News March 24, 2025

MBNR: మాజీ మంత్రి VS MLA.. తగ్గేదేలే..!

image

మహబూబ్‌నగర్‌లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు మాజీ మంత్రి, BRS మాజీ MLA శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫైర్ అవుతున్నారు. 14 నెలల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేసిందంటున్నారు. మరోవైపు MLA యెన్నెం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. అప్పులు చేసి ఆగం చేసింది BRS వాళ్లే అని కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?

error: Content is protected !!