News April 2, 2025
నారాయణపేట: ‘విద్యార్థుల అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం’

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. యూనివర్సిటీలో భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ తరఫున విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా భూములు తీసుకునే విషయంలో వెనక్కి తగ్గాలని సూచించారు.
Similar News
News April 5, 2025
పాస్టర్ ప్రవీణ్ మృతిపై తీవ్ర ఆరోపణలు.. హర్ష కుమార్‌పై కేసు నమోదు

AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ MP హర్ష కుమార్‌పై తూ.గో.(D) రాజానగరం పోలీసులు BNS సెక్షన్లు 196, 197 కింద FIR నమోదు చేశారు. ప్రవీణ్‌ను చంపి పడేశారని, పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఇటీవల ఆయన ఆరోపించారు. దీంతో విచారణకు వచ్చి ఆధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసులిచ్చారు. విచారణకు హాజరు కాకపోగా, మళ్లీ అదేస్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో తాజాగా కేసు నమోదు చేశారు.
News April 5, 2025
పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలి

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం పెద్దపల్లిలో జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి అధ్యక్షతన జిల్లాస్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News April 5, 2025
కాళ్ల: బాబూ జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన కలెక్టర్

కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో భారతదేశ తొలి ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం కలెక్టర్ సి.నాగరాణి నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి గ్రామ సర్పంచ్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, సమాజంలో అణగారిన ప్రజల కోసం కృషి చేసిన మహనీయుడని ఆయన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.