News February 25, 2025

నారాయణపేట: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

image

ఉమ్మడి MBNR జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వివరాలిలా.. కొత్తకోటకు చెందిన చరణ్‌రెడ్డి, అనిల్ HYDకి వెళ్తూ బైక్‌ అదుపు తప్పి మృతిచెందారు. కొత్తపల్లి మండలం నిడ్జింతతండాలో వాహనం అదుపు తప్పి కిందపడటంతో మద్దూరుకు చెందిన రాములు చనిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకెళ్తుండగా బొలెరో వాహనం వారి బైక్‌ను ఢీకొనడంతో వడ్డేపల్లి మండల వాసి మురళి స్పాట్‌లోనే ప్రాణాలు వదిలాడు.

Similar News

News February 25, 2025

రాహుల్ గాంధీతో శశిథరూర్‌కు పడటం లేదా!

image

అధిష్ఠానంతో కాంగ్రెస్ MP శశిథరూర్‌కు పొసగడం లేదా? BJP, మోదీ, LDFపై ఆయన స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం రాహుల్, సోనియాకు నచ్చడం లేదా? ఈ విభేదాలు ఇప్పుడు మరింత ముదిరాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ‘నా అవసరం మీకు లేకుంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయి’ అని థరూర్ స్పష్టం చేయడాన్ని ఉదహరిస్తున్నారు. దీన్నిబట్టి రాబోయే రోజుల్లో కేరళ రాజకీయాలు రసవత్తరంగా మారొచ్చని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.

News February 25, 2025

దుద్యాల్: లగచర్ల రైతులు ఇండస్ట్రియల్ పార్కుకు సహకరిస్తున్నారు: కలెక్టర్

image

లగచర్ల రైతులు స్వచ్ఛందంగా ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి సహకరిస్తున్నారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్‌కు సంబంధించి తమ భూమి స్వచ్ఛందంగా ఇచ్చిన 22 మంది రైతులకు చెక్కులు పంపిణి చేశారు. భూములు ఇస్తున్న రైతులకు నష్టపరిహారాలు అందించి ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.

News February 25, 2025

హిందూపురం మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి

image

హిందూపురం దివంగత మాజీ శాసనసభ్యుడు రంగనాయకులు సతీమణి ఈశ్వరమ్మ మంగళవారం ముదిరెడ్డిపల్లిలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి, కౌన్సిలర్లు మద్దన జయప్ప, మహేశ్ గౌడ్ ఈశ్వరమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగనాయకులకు సహధర్మచారిణిగా అన్ని పార్టీల నాయకులకు ఈశ్వరమ్మ సుపరిచితురాలని పేర్కొన్నారు. కాగా రంగనాయకులు 1985-85, 2004-9 మధ్య MLAగా ఉన్నారు.

error: Content is protected !!