News April 5, 2025
నారాయణపేట: సీతకు శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు

తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన కే.సీత దయాకర్ రెడ్డిని నేడు నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కే.ప్రశాంత్ కుమార్ రెడ్డితో పాటుగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిశారు. సీతా దయాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 7, 2025
ఇకపై CSK మ్యాచ్‌లు కవర్ చేయం: అశ్విన్ YT ఛానల్

CSK ప్లేయర్ అశ్విన్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో ఓ అనలిస్ట్ చెన్నై టీమ్ సెలక్షన్‌ను తప్పుబట్టారు. దీనిపై ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదంపై యూట్యూబ్ ఛానల్ ప్రకటన విడుదల చేసింది. ‘ఇకపై CSK మ్యాచ్‌లను కవర్ చేయం. ఛానల్‌లో గెస్ట్‌లు చేసే వ్యాఖ్యలతో అశ్విన్‌కు ఎలాంటి సంబంధం ఉండదు’ అని వివరణ ఇచ్చింది. అశ్విన్‌కు ఛానల్ ఉన్నట్లు తనకు తెలియదని ఇటీవల చెన్నై కోచ్ ఫ్లెమింగ్ అన్నారు.
News April 7, 2025
NZB: కలెక్టరేట్‌లో ఉచిత అంబలి

తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నెలకొల్పిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ప్రారంభించారు. చల్లని తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అన్నారు.
News April 7, 2025
తిరుపతి: వివిధ పథకాలకు రూ.కోటి విరాళం

టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు రూ.కోటి విరాళంగా అందింది. ఈ మేరకు ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చింది.