News April 1, 2025

నారాయణపేట: సెంట్రల్ GOVT జాబ్ కొట్టాడు..!

image

నారాయణపేట మండల పరిధిలోని కందేన్‌పల్లి గ్రామానికి చెందిన యువకుడు బోయిని రఘువర్ధన్ ఇండియన్ నేవీ ఆర్మీ జాబ్ సాధించాడు. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆ యువకుడి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి చదివి జాబ్ సాధించాడు. నేవి జాబ్ సాధించిన రఘువర్ధన్‌కు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

Similar News

News April 3, 2025

BSNL-JIO ఒప్పందం.. కేంద్రానికి రూ.1757కోట్ల నష్టం

image

JIOకు BSNL బిల్లు వేయని కారణంగా కేంద్ర ప్రభుత్వం రూ.1757.56Cr నష్టపోయిందని కాగ్ పేర్కొంది. CAG రిపోర్ట్ ప్రకారం.. 2014లో రెండు సంస్థల మధ్య మౌలిక సదుపాయాల షేరింగ్‌కు ఒప్పందం జరిగింది. 10ఏళ్లుగా JIO నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. Telecom Infrastructure Providersకు చెల్లించిన రెవెన్యూ షేర్ నుంచి లైసెన్స్ ఫీజ్‌ కట్ చేయకపోవడంతో BSNL రూ.38.36Cr నష్టపోయింది.

News April 3, 2025

విదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు.. అమెరికన్లపై భారం

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లతో ఆ దేశ ప్రజలపై భారం పడనుంది. అగ్రరాజ్యం కాఫీ గింజల నుంచి కార్ల వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తాజా టారిఫ్‌లతో కార్ల ధరలు సగటున 2,500 డాలర్ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే, USకు దుస్తులు ఎగుమతి చేస్తున్న చైనా, వియత్నాం, బంగ్లాపైనా టారిఫ్‌లు పెంచడంతో వాటి ధరలూ పెరగనున్నాయి. మద్యం, ఇంధనం, కాఫీ గింజలు, కొన్నిరకాల పండ్ల ధరలు ప్రియం కానున్నాయి.

News April 3, 2025

టారిఫ్స్ పెంచేందుకు కారణమిదే..

image

అమెరికా ప్రెసిడెంట్ టారిఫ్స్ పెంచడంతో ఆ దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో విదేశీ కంపెనీలు అగ్రరాజ్యానికి వస్తువులను ఎగుమతి చేయడం తగ్గిస్తాయి. ఫలితంగా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు పెరుగుతాయి. అక్కడి వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. కొన్నేళ్ల వరకు ధరలు పెరిగినా ట్రంప్ నిర్ణయం దీర్ఘకాలంలో ఆ దేశానికి మేలు చేస్తుందని విశ్లేషకుల మాట.

error: Content is protected !!