News January 27, 2025
నారాయణపేటలో క్వింటా వేరుశనగ ధర ఎంతంటే?

నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం భారీగా వేరుశనగకాయ తరలి వచ్చింది.1551 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్ఠంగా రూ.5,775.. కనిష్ఠంగా రూ.3,020 ధర పలికింది. సోనారకం వరి ధాన్యం 9 క్వింటాళ్లు రాగా.. గరిష్ఠంగా రూ.1,939.. కనిష్ఠంగా రూ.1,939 ధర పలికింది. 50,69 క్వింటాళ్ల ఎర్ర రకం కందులు రాగా.. గరిష్ఠంగా రూ.7,549 కనిష్ఠంగా రూ.3,200 వరకు పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారి లక్ష్మణ్ తెలిపారు.
Similar News
News March 14, 2025
ఈ నెల 19న యూకే పార్లమెంటులో చిరుకు అవార్డు

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 19న యూకే పార్లమెంటులో ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నారు. కల్చరల్ లీడర్‌షిప్‌తో ప్రజాసేవకు కృషి చేసినందుకు గానూ ఈ పురస్కారంతో సన్మానించనున్నారు.
News March 14, 2025
పిఠాపురం: డూప్లికేట్ కాకుండా జనసేన మీడియా పాస్‌లు

మరికొద్ది గంటలో జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. అయితే కొంతమంది మీడియా ముసుగులో హడావుడి చేస్తున్నారు.ఈ నేపథ్యం పురస్కరించుకుని ఎలాంటి డూప్లికేట్ పాస్‌లు తయారు చేయకుండా ఉండేందుకు హాలోగ్రామ్‌తో కూడిన మీడియా పాసులు జారీ చేశారు. అక్రిడేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే మీడియా పాస్ లిస్టు కలర్ జిరాక్స్ లేదా డూప్లికేట్ తయారు చేయకుండా హాలోగ్రామ్ పెట్టారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
News March 14, 2025
నా కెరీర్ ముగిసిందని అనుకున్నారు.. కానీ: విజయ్ సేతుపతి

తన కెరీర్ ముగిసిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో ‘మహారాజ’ సినిమా తనను నిలబెట్టిందని విజయ్ సేతుపతి తెలిపారు. ఓ అవార్డు కార్యకమంలో మాట్లాడుతూ ‘2-3 ఏళ్లు నా సినిమాలు బాగా ఆడలేదు. ఆ సమయంలో ‘మహారాజ’ వచ్చి నన్ను నిజంగానే ‘మహారాజ’ను చేసింది. దీనికి ఇంతలా ప్రశంసలు వస్తాయని ఊహించలేదు’ అని పేర్కొన్నారు. 2024లో రిలీజైన ఈ సినిమా చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియా సినిమాగా నిలిచింది.