News April 8, 2025

నార్సింగి : భర్తతో గొడవ ఆత్మహత్య

image

 భర్తతో గొడవ పడి భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి మండలంలోని వల్లూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లూరుకి చెందిన మౌనిక (30)భర్త సురేష్‌తో గొడవ పడి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. భర్త పనికి వెళ్లి వచ్చేసరికి మౌనిక ఈ దుర్ఘటనకు పాల్పడిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Similar News

News April 17, 2025

ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి: మెదక్ ఎస్పీ

image

ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. నెలవారి నేర సమీక్షా సమావేశంలో పెండింగ్‌లో ఉన్న కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.

News April 17, 2025

సర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలి: డీఈవో

image

మెదక్ జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే యుడైస్ సర్వేలో పరిశీలించిన అంశాలను పక్కగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాలల మౌలిక వసతుల వివరాలను పరిశీలించి, ఏమైనా తప్పులు ఉంటే యుడైస్ వెబ్ సైట్లో సరిదిద్దుకోవాలని పాఠశాల హెచ్ఎంలకు సూచించారు.

News April 16, 2025

కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకులు ఎడారి: హరీశ్ రావు

image

వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీళ్ల కోసం ప్రజల ఘోష పడాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పొలాలు తడారిపోతున్నాయని.. ప్రజల బతుకులు ఎడారి అయిపోతున్నాయని ఆవేదన చెందారు.

error: Content is protected !!