News April 16, 2025

నిందితుడికి జీవిత ఖైదు.. పోలీసులకు సత్కారం

image

వరంగల్ కమిషనరేట్ పరిధి గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధి బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడటంతో కృషి చేసిన వారిని డీసీపీ అంకిత్ కుమార్ సత్కరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రవికిరణ్, మర్రి వాసుదేవ రెడ్డి, భరోసా లీగల్ అడ్వైజర్ నీరజ, ఏసీపీ తిరుపతి, ఇన్‌స్పెక్టర్ బాబూలాల్, మహేందర్, హెడ్ కానిస్టేబుల్ విజేందర్, కానిస్టేబుళ్లు శ్రవణ్, యుగంధర్‌ను ఆయన అభినందించారు.

Similar News

News April 19, 2025

వరంగల్ సీపీ హెచ్చరిక

image

రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మైనర్లతో పాటు ఎలాంటి లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే వారిపై చర్యలు తప్పవని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. కమిషనరేట్‌ పరిధిలో మైనర్లను ప్రోత్సహించిన, వాహనాలు అందజేసినా యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

News April 19, 2025

ఎవరికి రూపాయి ఇవ్వనవసరం లేదు: వర్ధన్నపేట MLA 

image

తెలంగాణ ప్రజలను కోటీశ్వరులుగా చూడాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆశయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాపాలనలో ఏ అధికారి, నాయకుడికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా డబ్బులు అడిగితే 80961 07107కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

News April 18, 2025

వరంగల్‌: భద్రకాళి చెరువులోని మట్టి కావాలా?

image

వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీతలో భాగంగా నల్లమట్టి కావాల్సిన వారు నక్కలగుట్ట ఇరిగేషన్ సర్కిల్-2 కార్యాలయంలో సంప్రదించాలని ఈఈ శంకర్ తెలిపారు. ఒక క్యూబిక్ మీటరు మట్టికి రూ.71.83 డీడీ తీసి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాల కోసం సహాయ కేంద్రం నంబర్ 94406 38401ను సంప్రదించాలన్నారు. నల్లమట్టి పంట పొలాలకు ఎరువులా ఉపయోగపడుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

error: Content is protected !!