News December 29, 2024
నిఘా నీడలో హైదరాబాద్!
మహా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్, ఉప్పల్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, ఫిల్మ్‌నగర్, సరూర్‌నగర్ పబ్‌లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వేడుకల పేరుతో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులను ఆదేశించారు.
Similar News
News January 2, 2025
HYD: రూ.3,805 కోట్ల మద్యం తాగేశారు..!
హైదరాబాద్‌లో డిసెంబర్ 30, 31న వైన్స్ వద్ద మద్యం ప్రియులు భారీ క్యూ లైన్లలో నిలుచుని ఉండగా చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో రూ.3,805 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. డిసెంబర్ 23 నుంచి 31 మధ్య రూ.1700 కోట్ల ఆదాయం వచ్చిందని, గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్లు అధికమని తెలిపింది. అధికంగా డిసెంబర్ 30న రూ.402 కోట్లు, 31న రూ.282 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది.
News January 1, 2025
HYD: JAN 3 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు 2025 జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని HICC వేదికగా జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరినీ ఏకం చేసి తెలుగు భాష, సంప్రదాయం, సాహిత్యం, కళలను బలోపేతం చేయడంతో పాటు వాటిని భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహకులు తెలిపారు.
News January 1, 2025
HYD: ఇవన్నీ చుస్తే భయం వేస్తుంది: ఆకునూరి మురళి
దేశంలో పరిస్థితులు చూస్తుంటే నిజంగా భయమేస్తుందని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. దేశాన్ని చూస్తుంటే భయమేస్తోందన్న ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహీత అమర్థ్యసేన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ Xలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో సామాన్యులను మభ్యపెట్టి, రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చి వారు ధనవంతులను అందలం ఎక్కించి పేదోళ్లు, మధ్యతగతి వాళ్లను తొక్కేస్తున్నారని అన్నారు.