News August 31, 2024

నిజాంపట్నం హార్బర్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల నిజాంపట్నం హార్బర్ లో మూడవ నంబర్ ప్రమాదవ సూచిక ఎగురవేసినట్లు ఇన్‌ఛార్జ్ పోర్టు కన్జర్వేటర్ మోకా రామారావు శనివారం తెలిపారు. దీని ప్రభావం వల్ల సముద్రంలో బోట్లు వేటకు వెళ్ళరాదని ఒకవేళ ఎవరైనా వేటకు వెళ్లిన యెడల తీరానికి చేరాలని ఆయన తెలియజేశారు. వాయుగుండం తీరం దాటే సమయంలో ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దన్నారు.

Similar News

News September 29, 2024

పెనుమూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

రేపల్లె మండలం పెనుముడి వారధి వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లె నుంచి మచిలీపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సును అవనిగడ్డ వైపు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వెహికల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ లేలాండ్ లో ఉన్న పదిమందిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలుకాగా క్షతగాత్రులను రేపల్లె సీఐ మల్లికార్జునరావు ఆసుపత్రికి తరలించారు.

News September 29, 2024

రౌడీ షీటర్లు మంచి మార్గంలో జీవించండి: ఎస్పీ సతీశ్

image

గుంటూరు నగరంలోని రౌడీషీటర్లకు ఆదివారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి పద్ధతి మార్చుకొని మంచి మార్గంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించాలని సూచించారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతుందని చెప్పారు.

News September 29, 2024

అమరావతి: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.లక్ష విరాళం

image

క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆదివారం రూ.లక్ష చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తూ ఎంతగానో బాధితులను ఆదుకున్నారని క్రైస్తవ మిషనరీ సంఘం వారు ఆన్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సహాయం అందించడం జరిగిందని మిషనరీ బిషప్ అన్నారు.