News March 15, 2025
నిజాంసాగర్: గ్రామస్థుల సహకారం అవసరం: కలెక్టర్

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రులకు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్ విద్యార్థులకు సులభంగా మౌలిక భాషా గణిత సామర్ధ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
ఫెడరల్ వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది: స్టాలిన్

రాజ్యాంగానికి మూలమైన ఫెడరల్ వ్యవస్థ ప్రస్తుతం ప్రమాదంలో పడుతుందని CMస్టాలిన్ ఆరోపించారు. విద్య, నిధుల అంశాల్లో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని అన్నారు. మద్రాస్ బార్ అసోసియేషన్ 160 సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక న్యాయవాది తమిళంలో ప్రసంగిస్తారు అనుకుంటే ఇంగ్లీష్‌లో మాట్లాడారు. మరొకరేమో ఆంగ్లంలో అనుకుంటే తమిళంలో ప్రసంగించారు. ఇది తమిళనాడు ఇక్కడ రెండు భాషలే ఉంటాయని తేల్చిచెప్పారు.
News March 16, 2025
రాజమండ్రి: క్యారమ్స్ ఆడిన కలెక్టర్, ఎస్పీ

నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన క్యారం బోర్డు వద్దకు కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ డి.నరసింహ కిషోర్, కమిషనర్ కేతన్ గార్గ్‌లు వెళ్లి ఆటవిడుపుగా కొద్దిసేపు క్యారమ్స్ ఆడారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం జరిగింది. బిజీ బిజీగా ఉండే కలెక్టర్, ఎస్పీ, కమిషనర్‌లు తిరుగు పయనంలో క్యారమ్స్ ఆడి వినోదం పొందారు. ఆ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
News March 16, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నాణ్యతగా ఉండాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నాణ్యతగా ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. పటాన్ చెరు మండలం రామేశ్వరం మండలం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను శనివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా శిక్షణ పొందిన మహిళా మేస్త్రిలు ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చలపతి, తహశీల్దార్ రంగారావు పాల్గొన్నారు.