News March 16, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల

నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం ప్రాజెక్టు నుంచి 5వ విడత నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న పంటల సాగు కోసం ఇప్పటి వరకు 4విడతల్లో సుమారు 8టీఎంసీల నీటిని ఆయకట్టుకు అందించారు. ప్రస్తుతం ప్రధాన కాలువ ద్వారా ఐదో విడత నీటిని 1,213 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 1405.00 అడుగులకు 1396.75 అడుగుల, నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ సొలోమన్ తెలిపారు.
Similar News
News March 17, 2025
ధర్పల్లి: మల్లయ్యను చంపిన భార్య, కొడుకు

ధర్పల్లి (M) హోన్నాజిపేట్లో <<15782697>>మల్లయ్య <<>>హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన మల్లయ్యకు కొన్నెళ్లుగా భార్యతో, కొడుకుతో డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం తండ్రీకొడుకులు గొడవపడగా విషయాన్ని తల్లికి చెప్పాడు. దీంతో తల్లీకొడుకులు మల్లయ్యతో గొడవపడి కొందకు పడేసి, బీరుసీసాతో తలపై కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
News March 17, 2025
NZB: ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల: DEO

ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రెండు సమయాల్లో కొనసాగుతాయని వివరించారు. అలాగే ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 3 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయన్నారు. కావున విద్యార్థులు పరీక్షల కోసం సన్నద్ధం కావాలని సూచించారు. సందేహాలు ఉంటే కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
News March 16, 2025
నిజామాబాద్: అనుమానాలను నివృత్తి చేయాలి: కవిత

గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ట్రాన్స్‌లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని అంటున్నారన్నారు.