News March 4, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

నిజాంసాగర్‌కు చెందిన హరికుమార్ (26) ఈనెల 1న ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా హరికుమార్ మృతదేహం ఇవాళ లభ్యమైందని పోలీసులు తెలిపారు. కాగా హరికుమార్ మద్యానికి బానిసై అర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తితో సూసైడ్ చేసుకున్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 4, 2025
15 కేజీల బంగారంతో పట్టుబడ్డ నటి

బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రాన్యా రావ్ DRI అధికారులకు పట్టుబడ్డారు. రాన్య 15రోజుల్లో 4సార్లు దుబాయ్ వెళ్లి రావడంతో అధికారులు నిఘా పెట్టారు. నిన్న రాత్రి దుబాయ్ నుంచి బెంగళూరు రాగానే ఆమెను విచారించారు. రాన్య వద్ద 15 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేశారు. గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకొస్తున్నారని తెలిపారు. తాను మాజీ DGP రామచంద్రరావు కూతురినని ఆమె చెప్పారన్నారు.
News March 4, 2025
GWL: ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని, ఆ పరిసరాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని సూచించారు. 500 మీటర్ల వరకు ప్రజలు గుమికూడ రాదన్నారు.
News March 4, 2025
నల్గొండ: నీట్ పరీక్షకు కలెక్టర్ కసరత్తు

మే 4న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయమై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల, అలాగే మీర్‌బాగ్ కాలనీలో ఉన్న నల్గొండ పబ్లిక్ పాఠశాలల్లో నీట్ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకై మౌలిక వసతులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.