News February 15, 2025
నిజామాబాద్: 18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

నిజామాబాద్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.
Similar News
News March 12, 2025
NZB: ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

నిజామాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల బృందం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి తనిఖీలు చేపడుతోంది. ప్రధాన గేటుకు తాళం వేసి సోదాలు చేస్తున్నారు. పలువురు ఏజెంట్లు లోపల ఉండగా ఈ దాడి జరిగింది. కాగా ఈ కార్యాలయం పరిధిలో పలువురు అధికారులు ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలోనే ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది.
News March 12, 2025
NZB: గ్రూప్-2లో BC(A) విభాగంలో SIకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడవ బెటాలియన్ రిజర్వ్‌డ్ ఎస్సై BC(A) లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్పల్లి ఏడవ బెటాలియన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.
News March 12, 2025
ఆర్మూర్: గ్రూప్స్ ఫలితాలలో సత్తా చాటిన పెర్కిట్ వాసి

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన రామ్ కిషోర్ గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్-2 ఫలితాలలో 136వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.