News June 8, 2024

నిజామాబాద్: ఇద్దరు విద్యార్థులు డిబార్

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఎస్ఎస్ఆర్, నరేంద్ర కళాశాల కేంద్రాల్లో విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడ్డారు. ఉదయం జరిగిన ఆరో సెమిస్టెర్ రెగ్యులర్ పరీక్షలకు 6,086 మందికి 5,670 మంది, మధ్యాహ్నం ఒకటో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలకు 3,050కి 2,840 మంది హాజరైనట్లు పేర్కోన్నారు.

Similar News

News February 11, 2025

బాల్కొండ: పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

బాల్కొండలోని బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కిచెన్, డైనింగ్ హాల్‌లను కలెక్టర్ పరిశీలించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్‌ను పరిశీలించారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు.

News February 11, 2025

నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు

image

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

News February 11, 2025

జక్రాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

నిజామాబాద్ జిల్లా 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జక్రాన్‌పల్లి మండలం పడకల్ వద్ద ట్రాక్టర్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాజేశ్వర్, ఓడ్డేన్న మృతి చెందగా.. విజయ్ గౌడ్, మహేశ్ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!