News October 25, 2024

నిజామాబాద్: ఎడపల్లి మండలంలో ఆవు బీభత్సం

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్‌లో గురువారం రాత్రి ఓ ఆవు గ్రామస్థులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఆవు గ్రామంలోని ప్రధాన వీధులలో తిరుగుతూ కనబడిన వారందరినీ గాయపరుస్తూ పరుగులు తీసింది. ప్రధాన రహదారిపై పరుగులు పెడుతూ ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడి ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి గ్రామస్థులతో కలిసి ఆవును అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News January 2, 2025

మాచారెడ్డి: రెసిడెన్షియల్ కోసం ఫేక్ ఆధార్..

image

రెసిడెన్షియల్ కోసం మీసేవ నిర్వాహకుడు డూప్లికేట్ ఆధార్ క్రియేట్ చేసిన ఘటన మాచారెడ్డి మండలం ఘన్పూర్‌లో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గ్రామానికి చెందిన ముహమ్మద్ షరీఫ్ ఫిలిప్పీన్ దేశానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోసం మీసేవ నిర్వాహకుడి సాయంతో డూప్లికేట్ ఆధార్ తయారు చేశారు. భార్యాభర్తల ఆధార్ నంబర్ సేమ్ ఉండడంతో RI రమేశ్ PSలో ఫిర్యాదు చేశారు.

News January 2, 2025

NZB: ఎస్సీ వర్గీకరణ వద్దని న్యాయమూర్తికి నివేదిక అందజేత

image

కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం దళిత కళ్యాణ్ సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ జస్టిస్ షమీం అక్తర్ కమిటీకి నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దౌలత్ చక్రే మాట్లాడుతూ.. అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీలను ఐక్యమత్యంగా ఉండకూడదనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేసిందన్నారు. 15% ఉన్న రిజర్వేషన్లను 22 % కు పెంచాలని డిమాండ్ చేశారు.

News January 2, 2025

రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

 జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా చర్యలు పాటించేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు.