News June 19, 2024
నిజామాబాద్: చెప్పేదొకటి.. చేసేదొకటి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1718764770576-normal-WIFI.webp)
జిల్లాలో చాలా ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఖలీల్‌వాడిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆర్థో పేరిట రిజిస్ట్రేషన్ అయింది. అక్కడ జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, స్త్రీ వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు. ద్వారకానగర్‌లో ఒక జనరల్ ఫిజిషియన్‌గా అనుమతి తీసుకుని సర్జన్లు సైతం నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ 394 ఆసుపత్రులు అనుమతులు పొందగా.. 122 అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి.
Similar News
News February 10, 2025
బాల్కొండ: వరద కాలువలో వ్యక్తి గల్లంతు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739115621326_50139228-normal-WIFI.webp)
బాల్కొండ మండలం బుస్సాపూర్ వద్ద ఇందిరమ్మ వరద కాలువలో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వ్యక్తి ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి పోవడంతో నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపి వేశారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మధ్యాహ్నం వరకు 2,500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగింది.
News February 10, 2025
ఆర్మూర్ రానున్న త్రిపుర గవర్నర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739093362853_51712009-normal-WIFI.webp)
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆర్మూర్ పట్టణానికి రానున్నట్లు BJP సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బాసరలో మహా జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మామిడిపల్లిలోని వెంకటేశ్వర స్వామి వారిని, సిద్ధుల గుట్ట సిద్ధేశ్వరుడిని దర్శించుకొనున్నారు. BJP సీనియర్ నాయకులు భూపతి రెడ్డి స్వగృహానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లిన అనంతరం బాసరకు బయలుదేరుతారు.
News February 10, 2025
NZB: గత ప్రభుత్వంలో మొదలు పెట్టిన పనులను కొనసాగించాలి: కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739111335346_50139228-normal-WIFI.webp)
బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొండగట్టు రోడ్డు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.