News May 7, 2024

నిజామాబాద్ జిల్లా నా గుండెల్లో ఉంటుంది: KCR

image

తాను చచ్చేంత వరకు నిజామాబాద్ జిల్లా తన గుండెల్లో ఉంటుందని KCR అన్నారు. సోమవారం రాత్రి నగరంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. తాను గులాబీ జెండా ఎత్తినప్పటినుంచి తన వెంట నిజామాబాద్ జిల్లా ప్రజలు నడిచారన్నారు. మొదటిసారిగా బీఆర్ఎస్ తరఫున జిల్లా పరిషత్‌ను గెలిపించిన ఘనత కూడా జిల్లాకే దక్కుతుందన్నారు.

Similar News

News January 17, 2025

లింగంపేట్: యాక్సిడెంట్‌లో యువకుడి మృతి.. గ్రామస్థుల ధర్నా

image

లింగంపేట మండలం ముస్తాపూర్ తండాలో గ్రామానికి చెందిన మోహన్ అనే యువకుడు గురువారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో అతను మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో అతను మృతి చెందాడని కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గ్రామస్థులు శుక్రవారం ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది.

News January 17, 2025

NZB: కేసీఆర్ కృషి ఫలించింది: MLC కవిత

image

బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని KCR చేసిన కృషి ఫలించిందని MLC కవిత ‘X’ వేదికగా పేర్కొన్నారు. కృష్ణా నీళ్లలో మా వాటా మాకే అని కేసీఆర్ చేసిన పోరాట ఫలాలు అందుకోవడం ఎంతో దూరంలో లేదు. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరపాలని గత పదేళ్లుగా KCR చేసిన వాదనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొగ్గు చూపడం సంతోషకరమని అన్నారు. ‘ఇది BRS, తెలంగాణ ప్రజల విజయం.. అంటూ’ కవిత ట్వీట్ చేశారు.

News January 17, 2025

రాజంపేట: చైన్ స్నాచింగ్‌కు యత్నించి.. ఖాళీ చేతులతో

image

బైక్‌పై వెళ్తున్న దుండగులు ఆటోలో వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాగేందుకు ప్రయత్నించగా గొలుసు తెగి ఆమె ఒడిలో పడింది. ఈ ఘటన రాజంపేట మండలం అరగొండ హైస్కూల్ వద్ద గురువారం జరిగింది. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఈ విషయమై బిక్కనూరు సీఐ సంపత్ మాట్లాడుతూ.. యూనికార్న్ బైక్‌పై ఉన్న వ్యక్తులను ఎవరైనా గుర్తిస్తే 8712686153 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.