News October 11, 2024
నిజామాబాద్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: కలెక్టర్

విజయ దశమి వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చేసుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో చేసుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
Similar News
News March 11, 2025
నిజామాబాద్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

మెండోరా మండలం వెల్గటూర్‌కు చంద్రగిరి వెంకటేశ్(39) ఆర్థిక నష్టాలతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ నారాయణ తెలిపారు. వెంకటేష్ ఉపాధి కోసం మూడు సార్లు దుబాయ్ వెళ్లొచ్చాడని చెప్పారు. వెల్గటూర్ కల్లు గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడన్నారు. భార్య శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News March 11, 2025
NZB: కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్: కవిత

కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. 15 నెలల పాలనలో రేవంత్ సర్కారు మనిషికి 2.5లక్షల అప్పులు చేసిందని ఆరోపించారు. కానీ పేద ప్రజలకు ఒక్క మంచి పని చేయలేదని, ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, మరి ఈ డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
News March 11, 2025
NZB: 14 మంది సీఐల బదిలీ

మల్టీజోన్-1 పరిధిలో 14 మంది CIలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో CCS నిజామాబాద్‌కు ఐజీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న రవి కుమార్, NIB నిజామాబాద్‌కు PCR కామారెడ్డి నుంచి జి.వెంకటయ్యను బదిలీ చేశారు. కాగా బదిలీ అయిన 14 మంది సీఐల్లో అధిక శాతం మంది వెయిటింగ్‌లో ఉన్నవారే ఉన్నారు.