News March 20, 2024

నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్..!

image

నేడు నిజామాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం కామారెడ్డిలోనూ వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.
SHARE IT

Similar News

News April 4, 2025

నిజామాబాద్: దరఖాస్తుల ఆహ్వానం

image

నిజామాబాద్ జిల్లాలో గ్రామ పాలనాధికారులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన మాజీ వీఆర్ఓలు, వీఆర్ఎలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అర్హత కలిగిన వారు ఈ నెల 16వ తేదీ లోగా గూగుల్ ఫామ్ https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాల కోసం https://ccla.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 4, 2025

NZB: కూలీ పనికి వెళ్లి.. మృత్యు ఒడిలోకి

image

నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన గంగాధర్ గురువారం గోదావరి నదిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. గోదావరి నదిలో పాడైపోయిన బోరు మోటారును తీయడానికి గంగాధర్ కూలీ పనికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News April 4, 2025

జైతాపూర్‌లో పంట కాలువలో పడి మహిళ మృతి

image

ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మీ (35) అనే మహిళ పంట కాలువలో పడి మృతి చెందింది. మృతురాలు ఏప్రిల్ ఒకటో తేదీన నిజామాబాద్ వెళ్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదని, పంట కాలువలో తన చెల్లి చనిపోయిన స్థితిలో ఉన్నట్టు పోలీసులకు పురిమేటి నాగయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.

error: Content is protected !!