News July 30, 2024

నిజామాబాద్ జిల్లాలో BSNL 4G సేవలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెల రోజుల్లో BSNL సేవలు ప్రారంభిస్తామని టెలికాం GM వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రైవేటు కంపెనీల్లో ఛార్జీలు పెరగడంతో ప్రజలు BSNL వైపు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 270 టవర్లను 4Gకి మార్చనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని టవర్లు పూర్తికాగా మరికొన్నింటి పనులు కొనసాగుతున్నాయి.

Similar News

News February 7, 2025

కోటగిరి: తల్లి, తనయుడు అదృశ్యం

image

కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన బండారి జ్యోతి(24) తన ఒకటిన్నర సంవత్సరాల కొడుకుతో అదృశ్యమైనట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బిడ్డతోపాటు వెళ్లిపోయింది. జ్యోతికి మాటలు రావని ఆచూకీ తెలిసినవారు కోటగిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News February 7, 2025

NZB: చోరీకి పాల్పడ్డ నిందితుడు అరెస్ట్

image

బైకు చోరీకి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి సీఐ మల్లేష్, జక్రాన్‌పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు. మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన సాయన్న  బైక్ ఈనెల 5వ తేదీన చోరీకి గురైంది. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మనోహరాబాద్‌లో రాకేశ్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బైకును రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. 

News February 7, 2025

NZB: CPకి MIM నాయకుల వినతి

image

రంజాన్ నేపథ్యంలో అర్ధరాత్రి దుకాణాలు తెరవడానికి అనుమతించాలని కోరుతూ MIMనాయకులు గురువారం నిజామాబాద్ ఇన్‌ఛార్జి CP సింధూశర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 13, 14 తేదీల్లో షబ్-ఎ-బరాత్, రంజాన్ మాసం సందర్భంగా అహ్మదీ బజార్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఖిల్లా రోడ్, బోధన్ చౌక్ ప్రాంతాల్లో అర్ధరాత్రి దుకాణాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరారు. 

error: Content is protected !!