News March 3, 2025
నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఆదివారం పోతంగల్, కోటగిరిలో 39.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. మెండోరా- 38.9, లక్మాపూర్- 38.5, చిన్న మావంది, జక్రాన్‌పల్లి -38.4, ధర్పల్లి -38.3, సాలూరా, వేపూర్- 38.1, ఎడపల్లి -38, గోపన్నపల్లి- 37.9, కమ్మర్‌పల్లి, పెర్కిట్ -37.7, మంచిప్ప, రెంజల్ -37.6, వెంపల్లి, నిజామాబాద్ -37.5, తొండకూర్, కల్దుర్కి, కొండూర్- 37.3, మోర్తాడ్- 37.2, ఏర్గట్లలో 37.1℃గా నమోదైంది.
Similar News
News March 4, 2025
UPDATE: NZB: లంచం తీసుకున్న ఇద్దరి అరెస్ట్

ఫిర్యాదుదారుని పేరు మీద ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినందుకు రూ.10 వేలు లంచం తీసుకున్న కేసులో సోమవారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిజామాబాద్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్-II చెన్న మాధవాణి శ్రీరామ రాజు, కార్యాలయ స్వీపర్ రంగసింగ్ వెంకట్ రావులను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. వారిని హైదరాబాద్‌లోని ఏసీబీ అదనపు కోర్టులో హాజరు పరచనున్నట్లు వారు వివరించారు.
News March 4, 2025
NZB: రాష్ట్రస్థాయి టైక్వాండోలో జిల్లాకు మెడల్స్

తెలంగాణ రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్‌లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి మెడల్స్ సాధించారు. ఇందులో భాగంగా 27 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించారని అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ మనోజ్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ ఛైర్మన్ బస్వాపురం లక్ష్మీ నరసయ్య విజేతలను అభినందించారు.
News March 4, 2025
నిజామాబాదు: చివరి ఆయకట్టుకు సాగు నీరు: సీఎస్

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం ఆమె యాసంగి పంటలకు సాగు నీటి సరఫరా, నీటి పారుదల శాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాసంగి పంటలకు రానున్న పది రోజులు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాగు నీరు, విద్యుత్తు సరఫరా అవసరమైన అందించాలన్నారు.