News April 13, 2025
నిజామాబాద్ జిల్లాలో మాచర్ల వాసుల మృతి

మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, ఆయన బావమరిది మహమ్మద్ రఫీక్‌లు నిజామాబాద్‌లో మృతిచెందారు. నందిపేట పరిధి సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫీక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతనిని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి ఊపిరాడక కన్నుమూశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 15, 2025
చిత్తూరు కలెక్టర్‌ను కలిసిన ఎంపీ

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆయన కార్యాలయంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మంగళవారం కలిశారు. పలు అంశాలపై సమీక్షించారు. ప్రజా సంక్షేమం, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌కు ఎంపీ సూచించారు.
News April 15, 2025
మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన

AP: ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. మే 2న రాజధాని పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభిస్తారు. దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన పనులు మోదీ చేత శంకుస్థాపన చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు మోదీ పర్యటన వివరాలను వెల్లడించారు. అలాగే మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రులకు CM దిశానిర్దేశం చేశారు.
News April 15, 2025
HYDను గ్లోబల్ బిజినెస్ హబ్‌గా చేస్తాం: మంత్రి

HYDను గ్లోబల్ బిజినెస్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ కమర్షియల్ స్పేస్‌ను అందుబాటులోకి తేవడం లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, పెట్టుబడులకు అనువైన వాతావరణం తెలంగాణలో ఉందని, జీడీపీలో రాష్ట్ర వాటా ట్రిలియన్ డాలర్లను చేరుతుందని ఆప్టిమిస్టిక్ ప్రకటన చేశారు.