News April 21, 2025

నిజామాబాద్: తేలనున్న 36,222 మంది భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. NZB జిల్లాలో మొత్తం 36,222 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,789 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,433 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

Similar News

News April 22, 2025

ధర్పల్లి: వడదెబ్బతో రైతు మృతి

image

ధర్పల్లి మండలం వాడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వడదెబ్బతో కరక రాములు(65) అనే రైతు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవల తన పొలంలో యంత్ర సాయంతో పంట కోయించారు. యంత్రం వెళ్లలేని ప్రాంతంలో మిగిలిపోయిన పంటను ఉదయం నుంచి కోస్తూ వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలిపారు.

News April 22, 2025

NZB: డిగ్రీ పరీక్షలు వాయిదా

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 28వ తేదీ నుంచి జరగాల్సిన డిగ్రీ రెగ్యులర్ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్, బ్యాక్ లాగ్ ఒకటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు కంట్రోలర్ వివరించారు.

News April 22, 2025

నిజామాబాద్: తేలనున్న 36,222 మంది భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. NZB జిల్లాలో మొత్తం 36,222 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,789 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,433 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

error: Content is protected !!