News June 22, 2024
నిజామాబాద్లో హైటెక్ వ్యభిచారం.. గుట్టును రట్టు చేసిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాట్సాప్లో అమ్మాయిల ఫొటోలు పంపి విటులను రప్పించి హైటెక్ వ్యభిచారం చేస్తున్న గుట్టును పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. సుభాష్ నగర్ ఏరియాలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్క సమాచారం మేరకు 3 టౌన్ ఎస్ఐ ప్రవీణ్, టౌన్ సీఐ నరహరి వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇద్దరు మహిళలతో పాటు, ఒక విటుడిని, వ్యభిచార నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
Similar News
News January 3, 2025
నవీపేట్లో ముగ్గురు బాలికలు మిస్సింగ్
ముగ్గురు బాలికలు అదృశ్యమైన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి వరకు గాలించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన SI వినయ్ కుమార్ విచారణ చేపట్టారు.
News January 3, 2025
నిజామాబాద్లో మహిళా దారుణ హత్య
నిజామాబాద్ నగర శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం సారంగాపూర్ వడ్డెర కాలనీలో వెలుగు చూసింది. కాలనీకి చెందిన దుబ్బాక సాయమ్మకు నలుగురు సంతానం. ముగ్గురికి వివాహం కాగా చిన్న కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. భర్త చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న 6వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 3, 2025
NZB: పాముతో చెలగాటం ఆడుతున్న బాలురులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొందరు చిన్న పిల్లలు పాములతో ప్రమాదకరంగా విన్యాసాలు చేశారు. ఈ ఘటన గురువారం నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయం ముఖ ద్వారం వద్ద చోటుచేసుకుంది. పీల స్కూల్ సమీపంలో పామును పట్టుకొని కొందరు పిల్లలు ఆటలాడుతూ తిరిగారు. కొంచెమైనా భయం లేకుండా పాముతో చెలగాటం ఆడుతూ సెల్ఫీలు దిగారు. పిల్లలపై స్థానిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు.