News January 20, 2025
నిడదవోలు విద్యార్థి విజయనగరంలో ఆత్మహత్య
తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన MBBS వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News February 5, 2025
పందలపాక హత్య కేసులో నిందితుడి తల్లి అరెస్ట్
బిక్కవోలు మండలం పందలపాకలో గత నెల 29న హత్యకు గురైన లలితేశ్వరి కేసులో నిందితుడు తల్లి గుంతికోలు వరలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో ఆమె పాత్ర ఉన్నట్లుగా విచారణలో తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనపర్తి సీఐ సుమంత్ తెలిపారు. వరలక్ష్మి కుమారుడు దుర్గాప్రసాద్ లలితేశ్వరిని కేబుల్ వైర్ మెడకు బిగించి చంపిన సంగతి విదితమే. ఈ హత్యలో మరికొందరి పాత్ర ఉందని గ్రామ మహిళలు ఇటీవల ఆందోళన చేశారు.
News February 5, 2025
విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్
విద్యార్థినిపై అత్యాచారం కేసులో జూనియర్ లెక్చరర్ వేదాల వినయ్ మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు. కేసు వివరాలను కొవ్వూరులో DSP దేవకుమార్ తెలిపారు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వినయ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో జూ.లెక్చరర్‌గా పని చేస్తున్నారు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఇంటర్ సెకండియర్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ నెల 28న విజయవాడలో లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
News February 5, 2025
అసంఘటిత కార్మికుల నమోదుకు స్పెషల్ డ్రైవ్ – కలెక్టర్
అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్ నందు ఉచిత నమోదుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్క కార్మికుడిని పోర్టల్‌లో నమోదు చేయించాలని సూచించారు.