News March 20, 2025

నిప్పుల కొలిమిలా ములుగు జిల్లా

image

ములుగు జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉ.10 గంటలకే జిల్లాలో నిప్పుల కొలిమిలా భానుడి భగభగలతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలో ఉష్ణోగ్రత 40@ డిగ్రీల వరకు చేరుతుండడంతో బయటికి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో 11:30 గంటల వరకు నిర్వహిస్తుండగా, 12:30 గంటల వరకు ప్రభుత్వ పాఠశాలలో నడుస్తున్నాయి.

Similar News

News March 28, 2025

మామిడికుదురు: పాము కాటుకు గురై యువతి మృతి

image

మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన కంచి శృతి (24) పాము కాటుకు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఉదయం 6.గంటల సమయంలో ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుండగా చేతిపై పాము కాటు వేయడంతో స్థానికులు వెంటనే రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 28, 2025

క్రిష్-4తో డైరెక్టర్‌గా మారనున్న హృతిక్

image

క్రిష్ సిరీస్‌లో నాలుగో సినిమా ‘క్రిష్-4’కు రంగం సిద్ధమైంది. ఆ మూవీ హీరో హృతిక్ రోషన్ ఆ సినిమాకు దర్శకత్వం కూడా చేయనున్నారని ఆయన తండ్రి రాకేశ్ రోషన్ ట్విటర్లో ప్రకటించారు. ‘పాతికేళ్ల క్రితం నిన్ను హీరోగా తెరపైకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆది చోప్రాతో కలిసి నిర్మిస్తూ నిన్ను క్రిష్-4 దర్శకుడిగా కూడా పరిచయం చేస్తున్నాను. ఈ కొత్త పాత్రలో ఆల్ ది బెస్ట్. నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి’ అని పేర్కొన్నారు.

News March 28, 2025

BREAKING: మహబూబ్‌నగర్: విద్యార్థి ఆత్మహత్య

image

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పీర్ల గుట్ట సమీపంలో ఉండే మణిదీప్(18) ఉదయం పేపర్ బాయ్‌గా పని చేస్తూ.. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!