News March 20, 2025

నిబంధనలు పాటించకపోతే కొరడా తప్పదు: డీఈవో

image

జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు వంటి పూట బడులను నిర్ధిష్ట వేళలు పాటించకుండా ఇస్తాను సారంగా నడిపితే చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ గురువారం అన్నారు. ఈ విషయంపై తమ దృష్టికి వస్తే పాఠశాలల మూసివేతకు ఆదేశాలు ఇస్తామని హెచ్చరించారు. ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన సమయ పాలనను ప్రైవేట్ యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

Similar News

News March 23, 2025

Dy.CM పవన్ కళ్యాణ్‌ని సన్మానించిన బుడగ జంగాలు

image

కర్నూలు జిల్లా పూడిచెర్లకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ సన్మానించారు. క్యాబినెట్, అసెంబ్లీలో బుడగ జంగలకు ఎస్సీ హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపిన కూటమి నాయకులకు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, MP బైరెడ్డి శబరికు కృతజ్ఞతలు తెలిపారు. 

News March 22, 2025

ఏప్రిల్ 5 నుంచి రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు

image

ఏప్రిల్ 5 నుంచి 6 వరకు కర్నూలు నగరంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో కిక్ బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం కార్యదర్శి నరేంద్ర ఆచారి తెలిపారు. శనివారం నగరంలోరాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు సంబంధించి బ్రోచర్‌ను పలువురు ఆవిష్కరించారు

News March 22, 2025

నంద్యాల జిల్లాలో దారుణ హత్య

image

నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

error: Content is protected !!