News April 5, 2025
నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

HYD నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. మిలీనియం బ్లాక్‌లో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ మాలెంపాటి అమరేశ్ రావు నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో ఉ.10 నుంచి సా.4 వరకు పాత భవనం మొదటి అంతస్తు ఆరో వార్డులో సంప్రదించాలి.
Similar News
News April 7, 2025
అఖిల్ నెక్స్ట్ మూవీ.. రేపు గ్లింప్స్?

అక్కినేని అఖిల్ ఎట్టకేలకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ‘ఏజెంట్’ వచ్చి రెండేళ్లైనా ఆయన మరే ప్రాజెక్టునూ అనౌన్స్ చేయని సంగతి తెలిసిందే. తాజాగా ఫ్యాన్స్‌కు అఖిల్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను రేపు ఉదయం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాతోనైనా అఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.
News April 7, 2025
నేటి నుంచి ‘అడవితల్లి బాట’.. ప్రారంభించనున్న పవన్

AP: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సర్కారు ‘అడవితల్లి బాట’ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రారంభించనున్నారు. అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. గిరిజన గ్రామాల అనుసంధానం, రోడ్ల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధిపై ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది.
News April 7, 2025
MHBD: ఏడేళ్ల చిన్నారిపై కిడ్నాప్‌కు యత్నం

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పిచ్చిరాం తండాలో ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చెయ్యడానికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సోదరుడు, మరో బాలుడితో చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో మాస్కులు ధరించిన ఇద్దరు దుండగులు వచ్చి చిన్నారిని బలవంతంగా బైకుపై ఎక్కించుకొని వెళ్లారు. చిన్నారి కేకలు వేయడంతో వదిలిపెట్టి పారిపోయారు.